వరంగల్ని అమెరికాకు ధీటుగా చేస్తాం

వరంగల్ని అమెరికాకు ధీటుగా చేస్తాం
  • వీలైనంత త్వరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తాం

వరంగల్: వరంగల్ మహా నగరాన్ని అమెరికాకు ధీటుగా అభివృద్ధి చేస్తామని, అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్లో నూతనంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ, హోల్సేల్ మార్కెట్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వరంగల్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు శ్రద్ధ చూపుతున్నారన్నారు. సీఎం సహకారంతో వచ్చే ఏడాదిలోపు వరంగల్ నగర రూపురేఖలు మారుస్తామన్నారు. వ్యాపారులందరికీ కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆర్థికంగా కూడా వారికి కావాల్సిన చేయూతనందిస్తామన్నారు. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించామని, భద్రకాళీ బండ్ నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రణాళికా రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య,  నగర మేయర్ గుండు సుధారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

'కళావతి’ పాటకు సితార స్టెప్పులు

రీల్ సీఎంగా యడ్యూరప్ప