న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై రాజకీయ వివాదం నడుస్తోంది. ఫేస్‌బుక్ ఇండియాలో పనితీరు విషయంలో పక్షపాతంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియాలో ఫేస్‌బుక్, వాట్సాప్‌ను బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తున్నాయని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్ ఘాటుగా తిప్పికొట్టారు. దీంతో ఈ వివాదంపై సోమవారం ఫేస్‌బుక్ స్పందించింది. హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్‌ను తాము నిషేధించామని స్పష్టం చేసింది.
We prohibit hate speech&content that incites violence&we enforce these policies globally without regard to anyone’s political position/party affiliation. We're making progress on enforcement&conduct regular audits of our process to ensure fairness&accuracy: Facebook spokesperson pic.twitter.com/8zHJhZuXXJ
— ANI (@ANI) August 17, 2020
‘ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించే కంటెంట్‌ను మేం నిషేధించాం. ఏ ఒక్కరి రాజకీయ అవసరాలు, అనుబంధాలకు సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా మేం ఈ విధానాలను అమలు చేస్తున్నాం. మేం పురోగతిని అమలు చేస్తున్నాం. న్యాయంతోపాటు కచ్చితత్వాన్ని నిర్థారించడానికి రెగ్యులర్ ఆడిట్‌లను కూడా నిర్వహిస్తున్నాం’ అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి చెప్పారు.