సఫాయి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి : పీపీ వావా

సఫాయి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి : పీపీ వావా

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సఫాయి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌‌‌‌  సభ్యుడు డాక్టర్‌‌‌‌  పీపీ వావా సూచించారు. మంగళవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్  భవన్​లో అడిషనల్​ కలెక్టర్‌‌‌‌  కుమార్  దీపక్ తో కలిసి అధికారులు, పారిశుధ్య కార్మికులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్మికుడికి ప్రభుత్వ పథకాలను అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. 

మూడు నెలలకోసారి వైద్య శిబిరం నిర్వహించి వారికి సేవలందించాలన్నారు. జీతాలు తక్కువగా ఉన్నాయని, కనీస వేతనాలు దక్కేలా చట్టాలను అమలు చేయాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశుధ్య కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు లోన్​ అందిస్తుందని చెప్పారు. కార్మికుల పిల్లల చదువుల కోసం అన్ని స్కూళ్లలో ఐదు శాతం రిజర్వేషన్  కల్పించినట్లు తెలిపారు. డీడబ్ల్యూవో రామ్ లాల్, డీఎంహెచ్ వో సుధాకర్ లాల్, ఎల్డీఎం కిశోర్ పాండే, బీసీ వెల్ఫేర్  ఆఫీసర్​ శ్రీధర్ పాల్గొన్నారు.