
వాషింగ్టన్: పహల్గాం టెర్రర్ అటాక్ను ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తీవ్రంగా ఖండించారు. భారత్కు పూర్తి మద్దతును అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ అటాక్.. టెర్రరిస్టుల నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న నిరంతర ముప్పులను గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా భద్రతాదళాలను ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు.
“కాశ్మీర్ టెర్రర్ అటాక్ బాధితులకు ఎఫ్ బీఐ సంతాపాన్ని తెలుపుతోంది. భారత ప్రభుత్వానికి తాము పూర్తిస్థాయి మద్దతును అందిస్తూనే ఉంటాం. ఈ ఘటన టెర్రరిస్టుల నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న నిరంతర ముప్పును గుర్తు చేస్తూనే ఉంటుంది. బాధితుల కోసం ప్రార్థించండి’’ అని అన్నారు.