హైదరాబాద్లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్లాన్: వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్లాన్: వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో వచ్చే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ట్యాంకర్ల నిర్వాహకులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. బోర్డు పరిధిలోని ట్యాంకర్లతో పాటు ప్రైవేట్​ ట్యాంకర్ల నిర్వాహకులతో ఆయన భేటీ అయ్యారు. గతేడాది నగరంలోని ఐదు డివిజన్ల పరిధిలో నీటి సమస్యలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం బోర్డు పరిధిలో 650  ట్యాంకర్లు ఉండగా మరిన్ని ట్యాంకర్లను ఏర్పాటు చేసే విషయంపై అధికారులు ఆలోచించాలన్నారు. ఈ ఏడాది 90 రోజుల ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోని ఇండ్లకు వేసవిలో ట్యాంకర్లను ఆర్డర్​ ఇస్తే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలన్నారు.