రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరుకు రెండు కోట్లు కేటాయించాం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మందమరిలో ఆర్ఓబీ ప్రారంభించడం సంతషకరమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని త్వరలోనే ఆర్ఓబీపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మందమరిలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరుకు రెండు కోట్లు కేటాయించామని త్వరలో మరో నాలుగు కోట్లను మంజూరు చేస్తామని తెలిపారు. 14 వార్డుల్లో 78 లక్షలతో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించామన్నారు.

 ఎంపీ సహకారంతో ఆయన నిధులు కూడా కొన్ని తీసుకుని నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఇంటర్ కనెక్టివేట్ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు సమస్యలు ఏడాదిలోపు తీర్చాలని అధికారులను కోరారు. 

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు.  ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా మందమర్రికి  రావడం, ఆర్ఓబి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన ఎంపీ నిధులను కేటాయిస్తా నని వెల్లడించారు. మందమర్రిలో ఆర్ఓబి ప్రారంభంతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయని చెప్పారు. 

క్యాతనపల్లి ఆర్వోబి పనులు పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజల సేఫ్టీ సౌకర్యాలేకే మొదటి ప్రాధాన్యతని చెప్పారు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ