న్యూఢిల్లీ:2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చి దిద్దుతాం..అది మావిజన్ అని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్దికి సంబంధించిన విజన్, రోడ్ మ్యాప్ ను శనివారం( నవంబర్16) వివరించారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కీలకమైన ప్రొపెల్లర్ అన్నారు.
22వ హిందూస్తాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్లో మాట్లాడిన మోదీ..2047లో భారత్ స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తవుతుంది.. అప్పటిలోపు భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఉపాధికోసం పెట్టుబడి, ఆత్మగౌరవం, ప్రజాప్రయోజనాలకోసం పనిచేయడం ప్రభుత్వం మంత్రం అన్నారు. భారతీయులు తమ సామాజిక మనస్తత్వాన్ని మార్చుకో వాలి..ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలని ప్రధాని మోదీ కోరారు. 21 శతాబ్దం భారతదేశపు శతాబ్ధంగా మారాలన్నారు ప్రధాని మోదీ. ఆ దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు.
ALSO READ | ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసింది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్