యాప్స్ చేసే సత్తా ఉంది కానీ పైసలే లేవు

టాలెంట్‌ కంటే బ్రాండింగ్‌, ప్రమోషన్‌ వంటివి ముఖ్యం
చైనీస్‌ యాప్‌ల బ్యాన్‌తో దేశీ టెక్‌ స్టార్టప్‌లకు డిమాండ్‌ వచ్చింది: ఐఐటీలు

న్యూఢిల్లీ: చైనీస్‌‌ టెక్నాలజీకి ధీటుగా యాప్స్‌‌ను క్రియేట్‌‌ చేసే సత్తామన దగ్గరుందని ఇండియన్‌‌ ఐఐటీలు చెబుతున్నాయి. తాజాగా 59 చైనీస్‌‌ యాప్‌‌లను బ్యాన్‌‌చేయడంతో దేశీయ స్టార్టప్‌‌లకు డిమాండ్‌‌ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కూడా దేశంలోని
వివిధ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఎడ్యుకేషనల్‌‌ ఇనిస్టిట్యూషన్స్‌‌ను కోరింది. కానీ ఇక్కడ ట్యాలెంట్‌‌ కంటే డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుందని, బ్రాండింగ్‌‌, మార్కెటింగ్‌‌ వంటి వాటికి ఫండ్స్ కావాలని ఐఐటీలు పేర్కొన్నాయి. ఎడ్యుకేషన్‌‌, ఇనొవేషన్‌‌ల పరంగా ఐఐటీ సిస్టమ్‌ ‌బ్రిలియంట్‌‌గా ఉందని, తాజా బ్యాన్‌‌తో ఇండియన్‌ టెక్‌ ‌కంపెనీలకు మంచి వాతావరణం కూడా దొరికిందని అంటున్నాయి. సేఫ్‌ యాప్స్‌‌కు కచ్చితంగా సపోర్ట్‌ ఇస్తామని ఐఐటీ ఢిల్లీ డైరక్టర్‌ వీ రామ్‌గోపాల్‌‌రావ్‌ ‌అన్నారు. దేశీయ టెక్‌‌ స్టార్టప్‌‌లు పుంజుకోవడంలో ట్యాలెంట్‌‌ లేదా సామర్థ్యం సమస్య కాదని చెప్పారు. యాప్‌‌ను తీసుకురావడం 20 శాతం టెక్నాలజీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటే, 80 శాతం మాత్రం ఫండింగ్‌‌, మార్కెటింగ్‌‌, బ్రాండింగ్‌‌, పాలసీలపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనే ఐసీఎంఆర్ అమోదించిన కరోనా టెస్టింగ్‌ ‌కిట్‌‌ను డెవలప్ చేశామని పేర్కొన్నారు. లాక్‌‌డౌన్‌ ‌టైమ్‌‌లో కొంతమంది మా విద్యార్ధులు జూమ్‌‌ లాంటి యాప్‌‌ను డెవలప్‌ చేశారని చెప్పారు.‘మాకు కావాల్సిందేంటంటే దీనిని(డెవలప్ చేసిన యాప్‌‌లను) ముందుకు ఎలా తీసుకెళ్లడమనేదే. దీనికి చాలా డబ్బు అవసరమవుతుంది. మార్కెట్‌‌లో డిమాండ్‌‌ను అందిపుచ్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని, దీనికి మేము అన్ని విధాలుగా మద్ధతుగా ఉంటామని అన్నారు. బ్యాన్‌‌ చేసిన చైనీస్‌‌ యాప్‌‌లలో చాలా వాటికి ఇండియా నుంచి ప్రాఫిట్స్‌‌కూడా ఉండవని ఐఐటీ రూపర్‌ డైరక్టర్‌ ఎస్‌‌కే దాస్‌‌ అన్నారు. ఇవి బిజినెస్‌‌ చేయడం లేదని యూజర్ల డేటాను ఏదో చేస్తున్నాయని చెప్పారు. ఐఐటీలు, ఇతర ఇనిస్టిట్యూషన్‌‌లలో ఉన్న విద్యార్ధులు చైనీస్‌ ‌యాప్‌‌లకు ధీటుగా యాప్‌‌లను డెవలప్‌ చేయగలిగే సామర్థ్యం కలవారని దాస్‌‌ చెప్పారు. కానీ డొమెస్టిక్‌‌ ప్రొడక్ట్స్‌ కు బ్రాండింగ్‌‌, ప్రమోషన్‌‌ చేయడానికి చాలా డబ్బులు కావాలని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని వాడుకోండి: ప్రభుత్వం
చైనీస్‌‌ యాప్‌‌ల బ్యాన్‌‌తో మార్కెట్‌‌లో ఏర్పడిన డిమాండ్‌‌ను ఇండియన్‌ ‌ఐఐటీలు, ఇతర విద్యాసంస్థలు అందిపుచ్చుకోవాలని యూనియన్‌ ‌హ్యుమన్‌‌ రిసోర్సెస్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌మినిస్టర్‌ రమేష్‌ పోఖ్రియల్‌‌ కోరారు. దేశాన్ని తన స్వంత కాళ్లపై నిలబడేలా మార్చాలన్నారు. ‘ఈ అవకాశాన్ని వదలొద్దు. మనల్ని వృద్ధి దారిలోకి ఇది తీసుకెళ్తుంది’ అని చెప్పారు. చైనీస్‌ ‌యాప్‌‌లు మనకు అవసరం లేదని, మనకంటూ విజన్‌‌ ఉందని అన్నారు. ఛాలెంజ్‌‌లు గొప్పగా ఉంటే మనం అంతగానే రైజ్‌‌ అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. యూజర్ల డేటాను విదేశాలకు పంపుతున్నాయనే కారణంతో ప్రభుత్వం 59 చైనీస్‌ ‌యాప్‌‌లను బ్యాన్‌ ‌చేసింది. ఇందులో అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌‌, బైట్‌‌ డ్యాన్స్‌‌ టిక్‌‌టాక్‌‌, టెన్సెంట్‌‌, వీ చాట్‌‌వంటి పాపులర్‌యాప్‌‌లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ టెక్నాలజీ ప్రొడక్ట్‌లకు డిమాండ్‌ ‌క్రియేట్‌ ‌చేస్తుందని ఐఐటీ ఖరగ్‌‌పూర్‌ పేర్కొంది. ‘ప్రభుత్వం చాలాగొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో దేశీ ఇనోవేషన్స్‌ ‌పుంజుకుంటాయి. ప్రపంచంలో మన టెక్నికల్‌ ‌ఇనోవేషన్స్‌‌ చాలా కిందిస్థాయిలో ఉన్నాయి. తొందర్లోనే మన ఎకోసిస్టమ్‌ ‌మెరుగుపడుతుంది’అని ఐఐటీ కాన్పూర్‌ చెప్పింది. ఐఐటీలు, ఎన్‌‌ఐటీలు వంటి ఇంజినీరింగ్‌‌ ఇనిస్టిట్యూషన్స్‌‌ ఇండియాలో ఉన్నాయి. మన రోజువారి అవసరాల కోసం యాప్‌‌లను క్రియేట్‌‌ చేసుకునే టెక్నాలజీ సామర్థ్యం మన దగ్గరుంది. కానీ ఈ సంస్థలు ముందు నుంచి పాఠాలు చెప్పడం కోసమే కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి మార్కెట్లకు ప్రొడక్ట్‌లు, సర్వీస్‌‌లను అందించే వైపు ఈ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఎంటర్‌‌ప్రెన్యూర్‌షిప్‌‌, ప్రొడక్ట్‌లను డెవలప్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ స్కీమ్‌‌లు, ఇంక్యుబేషన్‌ ‌సెంటర్లు, ఇండస్ట్రీలతో టై అప్‌ అవ్వడం వంటివి ఇందులో సాయపడుతున్నాయి.

For More News..

వీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం

దుకాణాలు, సూపర్ జజార్లలో ఎక్స్ పైరీ ఫుడ్ ఐటమ్స్

కరోనా డేంజర్లో హైదరాబాద్