లాహోర్: వన్డే వరల్డ్ కప్ కోసం తాము హోమ్‌వర్క్‌ను పూర్తి చేశామని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. టీమ్‌లో చాలా మంది కొత్త వారే అయినప్పటికీ కప్ గెలుస్తామన్న ఆత్మవిశ్వాసం ఉందని మంగళవారం ఇండియా బయల్దేరే ముందు చెప్పాడు. ‘ఇప్పటి వరకు నేను ఇండియాలో ఆడకపోయినా ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం లేదు. మెగా ఈవెంట్‌కు సంబంధించిన హోమ్‌వర్క్ చేశాం. ఆసియాలోని మిగతా దేశాల మాదిరిగానే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
వాటి గురించి మాకు అవగాహన ఉంది. కెప్టెన్‌గా నేను టీమ్‌ను నడిపిస్తుండటం ఓ గౌరవంగా భావిస్తున్నా. ట్రోఫీతో తిరిగొస్తామనే ఆశతో వెళ్తున్నాం’ అని బాబర్ పేర్కొన్నాడు. కాగా పాక్ దుబాయ్ మీదుగా బుధవారం హైదరాబాద్ చేరుకోనుంది. న్యూజిలాండ్‌కు చెందిన తొలి విడత ప్లేయర్లు మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకోగా, రెండో విడత ప్లేయర్లు బుధవారం రానున్నారు. మరోవైపు అఫ్గానిస్తాన్ టీమ్ ఇప్పటికే తిరువనంతపురం చేరుకుంది.