వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం : డీఎస్‌ చౌహాన్‌

వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం : డీఎస్‌ చౌహాన్‌

ఉప్పల్ స్టేడియంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్  మ్యా చ్ ల కోసం 12 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.  ప్రాపర్ ప్లాన్  తోనే   బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిపై వారం రోజుల క్రితమే హెచ్ సీఏతో మీటింగ్ పెట్టామన్నారు.  ఐపీఎల్ లో లాగే వరల్డ్ కప్ మ్యాచ్ లను కూడా  ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని తెలిపారు.  టీమ్స్ కు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. 

మ్యా్చ్ 2 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి... 11 గంటలకు ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తామని డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. పార్కింగ్ విషయంలో స్పెషల్ ప్లాన్ చేశామని,  సీసీ కెమెరాల కూడా  ఏర్పాటు చేశామన్నారు.  గ్రౌండ్ కి వచ్చిన ప్రతీ ఒక్కరు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.   బయట నుంచి ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ గ్రౌండ్ లోకి అనుమతి లేదనన్నారు.  కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ ని మానిటరింగ్ చేస్తామని తెలిపారు.  

ALSO READ : బావతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ

ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40 వేలు కాబట్టి మ్యాచ్ అయిపోయాక ఒకేసారి బయటకి వెళ్లకుండా... మెల్లగా వెళ్ళాలన్నారు.  క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ గ్రౌండ్ లోపల బయట మఫ్టీలో ఉంటారని తెలిపారు. ప్రేక్షకులకు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని హెచ్ సీ ఏ కి సూచించామని డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.  బ్లాక్ టికెట్స్ అమ్మేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు.