9 నెలలుగా మాకు జీతాలిస్తలేరు: ప్రజాభవన్ ప్రజావాణిలో మినీ అంగన్వాడీ టీచర్లు వినతి

9 నెలలుగా మాకు జీతాలిస్తలేరు: ప్రజాభవన్ ప్రజావాణిలో మినీ అంగన్వాడీ టీచర్లు వినతి

పంజాగుట్ట, వెలుగు: మినీ అంగన్వాడీ టీచర్లకు 9 నెలలుగా జీతాలు పెండింగ్​లో ఉన్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు  కె.సునీత, కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. తక్షణమే పెండింగ్​ వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  మినీ అంగన్వాడీ టీచర్లు మంగళవారం బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా​ఫూలే ప్రజాభవన్​కు తరలివచ్చి ప్రజావాణిలో నోడల్​అధికారి దివ్య దేవరాజన్​కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

అంగన్వాడీ మినీ టీచర్లకు సహాయకులను నియమించాలని విన్నవించారు. మరోవైపు, ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 401 దరఖాస్తులు వచ్చాయ. వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 60, విద్యుత్ శాఖకు 38,  రెవెన్యూకు 40,  ఇందిరమ్మ ఇండ్ల కోసం 216 అర్జీలు అందాయి. ఇతర శాఖలకు సంబంధించి 47 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.