భారత విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు బందీలుగా మార్చుకున్నారన్న వార్తలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. తమ వద్ద అలాంటి సమాచారమేదీ లేదని చెప్పింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఎంబసీ అధికారులు అందుబాటులో ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వ సాయంతో బుధవారం ఖర్కివ్ నుంచి పలువురు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పింది. ఖర్కివ్ నుంచి పశ్చిమ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రష్యా, రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది. గత కొన్ని రోజులుగా వేలాది మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చామని.. అందుకు సహకరించిన ఉక్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పింది. స్వదేశానికి తిరిగివచ్చేందుకు విమానాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఆశ్రయమిస్తున్న దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.
Our response to media queries regarding reports of Indian students being held hostage in Ukraine ⬇️https://t.co/RaOFcV849D pic.twitter.com/fOlz5XsQsc
— Arindam Bagchi (@MEAIndia) March 3, 2022