ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలతో నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ ప్రాంతంలో ఇప్పటివరకు 22 లైసెన్స్ ఉన్న తుపాకులను రిటర్న్ తీసుకున్నామని చెప్పారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పాటు లోకల్ పోలీసులను కేటాయించామని తెలిపారు. ఏదైన ఘటన జరగబోతుందని ఎవరికి ఎలాంటి సమాచారం అందిన పోలీసులకి ఫోన్ ద్వారా లేదా సీ విజిల్ యాప్ ద్వారా పిర్యాదు చేయొచ్చని సూచించారు. కవాతులో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ డీ.ఎస్.పీ రమేష్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.