వీహబ్​తో మహిళల ఆర్థిక సాధికారత...సీఈఓ సీత పళచోళ్ల వెల్లడి

వీహబ్​తో మహిళల ఆర్థిక సాధికారత...సీఈఓ సీత పళచోళ్ల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మహిళల ఆర్థిక సాధికారతకు వీహబ్(విమెన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ హబ్) కృషి చేస్తున్నదని వీహబ్​సీఈఓ సీత పళచోళ్ల తెలిపారు. వీహబ్​ద్వారా పల్లెలతో పాటు సిటీ మహిళలకు వ్యాపారాభివృద్ధి, పెట్టుబడులు, నెట్​వర్కింగ్, శిక్షణ, మెంటారింగ్​వంటి సేవలను అందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆమె వీహబ్​లో మీడియాతో ఇంటరాక్షన్​సెషన్​నిర్వహించారు. అందిస్తున్న సేవలు, సక్సెస్​ స్టోరీస్​ను వివరించారు.

పరిశ్రమల అభివృద్ధిలో మహిళా నాయకత్వం ప్రాముఖ్యతను గుర్తించి.. వీహబ్​ను రెండు వర్టికల్స్​గా విభజించి సేవలందిస్తున్నామని వెల్లడించారు. సోషల్ ఇంపార్ట్ అండ్ ఎంట్రప్రెన్యూర్​షిప్​వర్టికల్ ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక సుసంపన్నత వంటి రంగాల్లోని వ్యాపారాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. అర్బన్​ఇన్నోవేషన్ ​వర్టికల్ ద్వారా స్టార్టప్​లకు వివిధ దశల్లో సహకారం అందిస్తున్నామని చెప్పారు.