
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, చైనా కుమ్మక్కయ్యాయని.. ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరితమైన ఒప్పందం ఉన్నదని ఆయన చెప్పారు. దీన్ని మనం తప్పక అంగీకరించాల్సిందేనని తెలిపారు. ‘‘పాక్, చైనా మధ్య బంధం వర్చువల్ డొమైన్‌లో వంద శాతం ఉన్నది. ఇక ఫిజికల్‌గా పరిశీలిస్తే చైనాలో తయారైన మిలటరీ ఎక్విప్‌మెంట్‌నే ఎక్కువగా పాక్ వినిగియోగిస్తున్నది.
రెండు వైపుల నుంచి యుద్ధ ముప్పు పొంచి ఉందన్నది నిజం” అని పేర్కొన్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో పాక్ బార్డర్ వెంబడి టెర్రరిస్టుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని తెలిపారు.