స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: ఎంపీ కొండా

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: ఎంపీ కొండా

చేవెళ్ల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేవెళ్లలో కచరా బీఆర్ఎస్​పార్టీ తుడిచిపెట్టుకుపోతోందని విమర్శించారు. గురువారం చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీ నూతన మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులను సన్మానించారు. 

విశ్వేశ్వర్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సూచించారు. కాంగ్రెస్​ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. వచ్చే రెండు వారాలల్లో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల కమిటీలు వేస్తామన్నారు.