ఒకప్పుడు ఈ అబ్బాయి మంచోడు ఈ అమ్మాయి. మంచిది' అని మరొకరు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరి గురించి వాళ్లే చెప్పుకోవాలి. ఉద్యోగం, పెళ్లి, ఆఫీసు, మీటింగ్.. ఎక్కడైనా సరే. తనలోని టాలెంట్ ఏంటో నలుగురికి తెలిసేలా మాట్లాడాలి. లేదంటే వెనుకబడి పోయినట్లే పెద్దపెద్ద చదువులు చుదువుకున్నా నలుగురిలో నోరు విప్పకపోతే కష్టమే ఇంటర్యూలలో చాలామంది తమ గురించి తాము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లే ఫెయిల్ అవుతున్నారు. ఈ ఉద్యోగం అంటే నీకు ఎందుకు ఇష్టం..? నీకున్న అభిరుచులేంటి..? నీ గోల్ ఏంటి..? నీకు ఈ ఉద్యోగం ఇస్తే నిన్ను నువ్వు ఎలా నిరూపించుకుంటావు" లాంటి ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు.
Also Read :- ట్రంప్కు షాకిచ్చిన చైనా
వీటికి.. చదువుకు ఏ సంబందం ఉండదుకానీ ఇవే ఉద్యోగాన్ని తెచ్చి పెడుతున్నాయి. అంతేకాదు గ్రూప్ డిస్కషన్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోతే ప్రస్తుతం ఉద్యోగాల్లో పైకి ఎదగలేదు. వ్యక్తీకరణే వ్యక్తిత్వం అని చెప్తున్నారు మనోవిశ్లేషకులు. అందరిలో ధైర్యంగా మాట్లాడటం, తప్పు జరిగితే అంగీకరించడం అందరితో కలిసిపోవడం నవ్వుతూ పలకరించడం.. లాంటివే ఉద్యోగానికి కొలమానాలయ్యాయి. సర్టిఫికేట్ ఎంత పర్సంటేజ్ ఉన్నదనే దానికన్నా ఇవే ముఖ్యమైపోయాయి కాబట్టి ఎవరి గురించి వాళ్ల పూర్తిగా తెలుసుకోవాలి చెప్పుకోగలగాలి.
... వెలుగు లైఫ్