సెంట్రల్ ఫండ్స్​తో ఆర్థికంగా బలోపేతం కావాలి : పీవీ శ్యాంసుందర్​రావు

యాదాద్రి, వెలుగు : మత్స్యకారుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం రిలీజ్​ చేస్తున్న ఫండ్స్​తో ఆర్థికంగా బలోపేతం కావాలని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు అన్నారు. భువనగిరిలో నిర్వహించిన గంగపుత్రుల ఆత్మయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

మత్స్యకారుల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన స్కీం ద్వారా చేపల పెంపకం కోసం చెరువులను తవ్వుకోవాలని సూచించారు. మార్కెట్ వ్యవస్థ​ను బలోపేతం చేసుకోవాలన్నారు. 

కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని అశీర్వదించడం ద్వారా గెలిపించాలని ఆయన కోరారు. మీటింగ్​లో పార్టీ లీడర్లు దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్, నర్ల నర్సింగ్ రావు, పిట్టల అశోక్, రాజశేఖర్ రెడ్డి, గంగపుత్ర సంఘం లీడర్లు ఎంకర్ల వెంకటేశం, లక్ష్మయ్య, శంకర్, గౌటీ సత్తయ్య, ఎంకర్ల సత్తయ్య, పూస అంజయ్య ఉన్నారు.