మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ జి. రవినాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ధరణికి సంబంధించిన సమస్యలతో పాటు మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు, ఇతర ధ్రువపత్రాల జారీ, ఉపాధి, ఉద్యోగం వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, ఎస్.మోహన్ రావు, డీఆర్వో కేవీవీ రవికుమార్, డీఆర్డీవో యాదయ్య, ఆర్డీవో అనిల్ కుమార్, జడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు.
వనపర్తి: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో 49 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సంచిత్ గాంగ్వార్ కు జిల్లా అధికారుల సంఘం తరపున మొక్కను అందజేసి విషెస్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ఎస్. తిరుపతి రావు, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు, డీఆర్డీవో నర్సింగ్ రావు, సీపీవో భూపాల్ రెడ్డితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 92 ఫిర్యాదులు రాగా, అందులో 65 ఫిర్యాదులు ధరణికి సంబంధించినవి కావడం గమనార్హం. కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు,ఈడీఎం నరేశ్ పాల్గొన్నారు.
గద్వాల: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలపై ప్రజలు అర్జీలను అందజేశారు. 85 మంది దరఖాస్తులు రాగా, వీటిలో 57 ధరణి సమస్యలకు సంబంధించినవే
కావడం గమనార్హం.