అంబేద్కర్​ బాటలో నడిచి అభివృద్ధి సాధించాలి..చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్​ బాటలో నడిచి అభివృద్ధి సాధించాలి..చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కూకట్​పల్లి, వెలుగు: అంబేద్కర్ అడుగుజాడల్లో అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో అన్ని రంగాల్లో రాణించాలంటే అంబేద్కర్ మార్గం అనుసరణీయమన్నారు. కూకట్​పల్లి దయార్​గూడలో అంబేద్కర్​ విగ్రహం వద్ద సింగూరు పాండు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్​ నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి మంగళవారం శంకుస్థాపన చేశారు.  

అంబేద్కర్​విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ.. దళితులు ఐక్యంగా ముందుకు సాగితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. షెడ్డు నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కూకట్​పల్లి నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జ్​బండి రమేశ్, కాంగ్రెస్​నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, సంజీవ, మేకల రమేశ్, మధుగౌడ్​, నరసింహ, జ్యోతి, సుధ, స్వరూపగౌడ్​పాల్గొన్నారు.