రిటైర్డ్‌‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం : పద్మావతి

కోదాడ, వెలుగు: రిటైర్డ్‌‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాటిచ్చారు.  బుధవారం ఎమ్మెల్యేను రిటైర్డ్‌‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రిటైర్డ్‌‌ ఉద్యోగుల ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని,  కోదాడలో వృద్ధాశ్రమం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.  

ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లెంపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు లక్ష్మీనారాయణ రెడ్డి,  పాండురంగారావు,  రామారావు,  సీతయ్య,  కౌన్సిలర్ కోల్లా ప్రసన్న లక్ష్మీ , సంఘం నేతలు  పాల్గొన్నారు.