ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ బాధితులకు అండగా ఉంటాం : తీన్మార్ మల్లన్న

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌)లో ఉద్యోగాలిప్పిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌, ఆయన అనుచరులు రూ.45 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించేంత వరకు వారికి అండగా ఉంటామని, టీమ్ తరుపున పోరాటం చేస్తామని తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శనివారం గోదావరిఖనిలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ బాధితుల తరుపున మాట్లాడేందుకు వచ్చిన సందర్భంలో తనను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. బొగ్గు గనుల్లో కష్టపడి పనిచేసే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్రానైట్‌‌‌‌‌‌‌‌, మై హోం రాజేశ్వర్‌‌‌‌ రావుకు చెందిన సిమెంట్‌‌‌‌‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు రాజకీయ సమాధి కడతానన్నారు. కాగా, యాదగిరి అనే తాపీ మేస్త్రీ తెలంగాణ కోసం భూములు, జాగలు కోల్పోయానని, తనపై 66 కేసులు నమోదయ్యాయని వేదికపై చెప్పుకోగా, ఆయనకు ఇల్లు నిర్మించి ఇస్తానని తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న హామీ ఇచ్చారు. అంతకు ముందు అడ్రియాల లాంగ్‌‌‌‌‌‌‌‌ వాల్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ వద్దకు వెళ్ళి కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. టీమ్‌‌‌‌‌‌‌‌ సభ్యులు దాసరి భూమయ్య, స్వామి, అంబటి నరేశ్‌‌‌‌‌‌‌‌, కొమ్ము రాకేశ్‌‌‌‌‌‌‌‌, మర్రి రాము, శ్రావణ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.