‘వక్ఫ్ బచావో మార్చ్’కు మద్దతు ఇస్తున్నం

‘వక్ఫ్ బచావో మార్చ్’కు మద్దతు ఇస్తున్నం
  • తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఎస్సీ, ఎస్టీ , బీసీ సంఘాలు

బషీర్​బాగ్, వెలుగు: ఏప్రిల్13న జరిగే మైనార్టీ వక్ఫ్ బచావో మార్చ్​కు తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఎస్సీ, ఎస్టీ , బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే  ధర్నాలో బహుజన సంఘాలు పాల్గొంటాయని జేఏసీ నాయకులు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో శుక్రవారం వారు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం భూములను లాక్కునే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో  మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.