మాకు ఆడపిల్లే కావాలి.. అమ్మాయిలను దత్తత తీసుకుంటున్న విదేశీయులు

మాకు  ఆడపిల్లే  కావాలి.. అమ్మాయిలను దత్తత తీసుకుంటున్న విదేశీయులు

కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. దాంతో పాటు మనుషుల ఆలోచనలు కూడా మారాయి.  ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఎందుకురా ఈ జీవితం.. అని భారంగా ఫీలయ్యేవారు.. అదే మగపిల్లాడైతే ఎగిరి గంతేసేవారు.  ఇక ఆడపిల్ల పుట్టిందని భార్యను కొంతమంది వదిలేస్తే,, మరికొంతమంది పురిటిలోనే..చిదిమేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కొంతమంది అనాథశ్రయాల్లో వదిలేవారు.  దీంతో రాను రాను పెళ్లి కాని ప్రసాద్ లు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయారు.. ఇది ఒకప్పటి మాట.  

కాని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆడపిల్లే కావాలి అని కోరుకుంటున్నారు.  ఒకవేళ అవకాశం లేకపోతే ఆడపిల్లలను దత్తత కూడా తీసుకుంటారు.  మన దేశమే కాదు... విదేశీయులు కూడా ఆడపిల్లవైపు మొగ్గుచూపుతున్నారు. 

పద్మవ్యూహంలో ప్రయాణం....  

ఆడపిల్ల జీవితమే పద్మవ్యూహంలో ప్రయాణం. ఎన్నో అవరోధాలను దాటితే తప్పు.. ఆమె కోరుకున్న జీవితం, కలలుగన్న అభివృద్ధి లభించని పరిస్థితి .. తల్లి కడుపు దాటకుండానే కన్ను మూస్తూ ఆమె పుట్టే హక్కును కోల్పోతుంది. కన్ను తెరిచినా.. ఆడపిల్ల పుట్టింది అని గొంతునులిమేస్తున్నారు. 

ALSO READ | ప్రేమికుల దినోత్సవం అగ్రిమెంట్ : ఈ కండీషన్స్ చూస్తే నోరెళ్లబెడతారు..!

ఒక సర్వే ప్రకారం దేశంలో ఏడాదికి 12 లక్షల ఆడ శిశువులు మొదటి పుట్టినరోజును చూడకుండానే ప్రాణాలు వదులుతున్నాడు. ఈ గండాలు దాటితే అత్యాచారాలు, గృహహింస వంటి అడ్డంకులను ఎదుర్కొలేక ఆమె జీవించే హక్కును కూడా కోల్పోతోంది. ఇక దేశ వ్యాప్తంగా రోడ్లమీద, చెత్తకుప్పల్లో, ఆసుపత్రి టాయిలెట్లలో అడశిశువులని వదిలి వెళ్లేవారి సంఖ్య రోజు రోజుకు  పెరుగుతూనే ఉంది. వాళ్లంతా అనాథా శ్రయాలకు చేరి దిక్కూ మొక్కూలేని వారిలా బతుకుతున్నారు.ఆడపిల్ల పుట్టిందని డాక్టర్ చెప్పగానే పేదవాడి నుంచి కోటీశ్వరుల వరకు చాలామంది ..ఆడపిల్లా..అని నిట్టూరుస్తారు. ఆడపిల్ల అంటేనే ఖర్చు, భారం అనే ఆలోచనలే వాళ్ల మెదడులో తిరుగుతయ్.

అమ్మాయిలే ఫస్ట్ ఛాయిస్

 దేశంలో ఒక వైపు స్త్రీ ..పురుష.. నిష్పత్తి ఆందోళన కలిగించేలా ఉంటే మరోవైపు... దత్తత తీసుకోవడానికి అనాధాశ్రమాలకు వస్తున్న చాలా మంది మాకు ఆడపిల్లే కావాలి అని అనడం  ఆశ్చర్యకరం. గత మూడేళ్లుగా అమ్మాయిలని దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అమ్మాయిలని దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్న వారిలో కేవలం మన దేశం వాళ్లే కాదు ఇక్కడికి వచ్చి దత్తత తీసుకుంటున్న విదేశీయులు మన కంటే ముందున్నారు. ఇవేం నోటి మాటలు కావు. ఇటీవల స్వయంగా కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ వివరాలు  వెల్లడించింది. 

అమ్మాయిలే కావాలి... 

ఈ మధ్య దత్తత తీసుకుంటున్న వారి ఫస్ట్ చాయిస్ అమ్మాయిలే ఇలా దత్తత తీసుకుంటున్న వాళ్లు డబ్బున్న వాళ్లు కూడా కాదు. పట్టణాల్లో నివసించే మధ్య తరగతి వాళ్లే ఎక్కువ మంది. గ్రామాల్లో అమ్మాయిల దత్తతపై అవగాహన ఇంకా తక్కువగానే ఉంది. కేంద్రం ప్రకటించిన డేటా ప్రకారం. .. 60 శాతం మంది అమ్మాయిలనే దత్తత తీసుకుంటున్నారు. సగటున పరిశీలిస్తే  మూడేళ్లలో మొత్తం 11వేల649 మంది పిల్లల్ని దత్తత తీసుకోగా వీరిలో 6వేల962 మంది అమ్మాయిలు కాగా 4వేల687 మంది అబ్బాయిలు ఉన్నారు. 

విదేశీయులూ ఆడపిల్ల వైపే... 

మన దేశానికి వచ్చి పిల్లల్ని దత్తత తీసుకునే విదేశీయులు కూడా అమ్మాయిల వైపే మొగ్గు చూపుతున్నారు. మనవాళ్లు 60 శాతం మందిని దత్తత తీసుకుంటే వీళ్లు మనకంటే ముందే ఉన్నారు.  మూడేళ్లలో  దత్తత తీసుకున్న పిల్లలలో 6 శాతం మంది అమ్మాయిలే కావడం విశేషం. విదేశీయులు మూడేళ్లలో  2 వేల110 మందిని దత్తత తీసుకోగా వీరిలో 1,394 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే...జెండర్ ఐయాసింగ్ ...పై చాలా మంది తమ అభిప్రాయం మార్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఎక్కువ మంది అమ్మాయిలనే దత్తత తీసుకోవడానికి మొగ్గు చూపుతుండటం కూడా పలు అనుమానాలకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా పరిశోధన జరగాలని కూడా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు..

-వెలుగు,లైఫ్-