2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ సీపీ 11 స్థానాలకు పరిమితమవ్వడం.. మార్పు కావాలని ప్రజలు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ప్రజలు తమ ఓటుకు న్యాయం జరగాలి అనుకున్నారు కనుకనే ఈ పలితాలు వచ్చాయని అన్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శమని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజల గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈసారి కాంగ్రెస్ మంచి ఫలితాలు తీసుకురాలేకపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుందని అనుకున్నప్పటికీ.. ప్రజలు గట్టి నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు.
ఎంత మంది వచ్చినా స్వాగతిస్తాం..
కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని, 2029లో అధికారంలో వస్తుందన్న ధీమా వ్యాఖ్యం చేశారు.. షర్మిల. వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారు అంటే అది తెలుగు ఎంపీలే వల్లే సాధ్యమయ్యిందన్న షర్మిల.. ఇప్పుడు హోదా సాధించే అవకాశం ఉందని తెలిపారు.