ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌ను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు

ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌ను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు
  • త్వరలోనే షుగర్‌‌‌‌ ఫ్యాక్టరీని తెరుస్తాం
  • ఇల్లు లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు


కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ పార్టీ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌ను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఐటీ, ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. జీవన్‌‌‌‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయబోనని పార్టీకి చెప్పారని, అందుకే ఇతర అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

ఇప్పటికే ఇల్లు ఉన్న వారు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవద్దని, ఇల్లు లేని పేదలకే వాటిని మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలన్న లక్ష్యంతోనే తాము దావోస్‌‌‌‌ వెళ్లామని, అనేక కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్లు జరిగాయన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే గతేడాది మొదటి సారిగా ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. 

రైతులకు ఉపయోగపడేలా ఆగ్రో ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్లను తీసుకొస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో మూతపడిన షుగర్‌‌‌‌ ఫ్యాక్టరీలను 2025 డిసెంబర్‌‌‌‌లోగా తిరిగి ప్రారంభించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్రం కూడా సహకరించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌‌‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌రెడ్డి, మాజీఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌‌‌‌ 
పాల్గొన్నారు.