గవర్నర్ ఆర్‌ఎన్ రవి నీట్ అనుకూల వైఖరిని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయన నిర్వహించే టీ పార్టీని తమ ప్రభుత్వం బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గవర్నర్ తమిళనాడు అసెంబ్లీ బిల్లుకు రాష్ట్రాన్ని జాతీయ పరీక్ష పరిధి నుండి మినహాయించేలా ఎప్పటికీ ఆమోదం ఇవ్వలేమని చెప్పారు. ఈ క్రమంలో గవర్నర్ చేసిన ప్రకటన విద్యార్థులు, యువకులను దిగ్భ్రాంతికి గురి చేసిందని.. రవి మాటలను ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. “గవర్నర్ వ్యాఖ్య బాధ్యతారాహిత్యం. తమిళనాడు ఏడేళ్ల సుదీర్ఘ నీట్ వ్యతిరేక పోరాటాన్ని ఇది చిన్నబుచ్చుతోంది” అని సీఎం తెలిపారు.
రవి ఉన్నత విద్యా శాఖను కూడా గందరగోళానికి గురిచేస్తున్నాడు. అతని వ్యాఖ్యలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలలను ధ్వంసం చేయడంతో సమానమని సీఎం అన్నారు. నీట్ అనుకూల వైఖరికి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తు చేసేందుకు స్టాలిన్.. “ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో నిర్వహించే టీ పార్టీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం” అని వివరించారు.
అంతకుముందు క్రోమ్‌పేటకు చెందిన జగదీశ్వరన్ అనే వ్యక్తి నీట్ పరీక్షలో రెండుసార్లు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణాన్ని తట్టుకోలేని తండ్రి సెల్వశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ఆత్మహత్యలపై స్పందించిన ఎంకే స్టాలిన్.. డాక్టర్ కావాలని కలలు కన్న ఓ తెలివైన విద్యార్థి ఇప్పుడు నీట్ ఆత్మహత్యల జాబితాలో చేరడం దారుణం అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని నీట్‌ను తొలగించవచ్చని చెప్పారు.
The cold-hearted stance of @rajbhavan_tn evident in his support for #NEET, showcases a disregard for our students' lives, dreams, and the democratically elected Government. The delayed assent to vital Bills by the Tamil Nadu Governor reflects a lack of commitment to the… pic.twitter.com/B8q3PkVGDc
— M.K.Stalin (@mkstalin) August 14, 2023