పెద్దపల్లికి మరిన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలు తీసుకొస్తాం: ఎంపీ వంశీ

పెద్దపల్లికి మరిన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలు తీసుకొస్తాం: ఎంపీ వంశీ

పెద్దపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు ఏం చేసిందని కాంగ్రెస్ నేత, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్లు పెద్దపల్లిని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం (డిసెంబర్ 4) పెద్దపల్లిలో యువ వికాసం పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 

ALSO READ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని విమర్శించారు. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిపోయారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటోందని అన్నారు. రామగుండం ఎన్టీపీసీని 800 మెగావాట్ల సామర్థ్యానికి పెంచే బాధ్యత మాదన్నారు. పెద్దపల్లికి మరిన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలను తీసుకొస్తామని.. పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు ఎంపీ వంశీ.