- ఎనిమిదేండ్లు పనులు నిలిచిపోవడంతో 9వ ప్లేస్‌కు: మెట్రో ఎండీ
- సెకండ్ ఫేజ్‌పై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు
- త్వరలో నాగ్‌పూర్ నుంచి కొత్త కోచ్‌లు
- ఆర్సీఎస్ టికెటింగ్ ప్రారంభించిన ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, గచ్చిబౌలి, వెలుగు: ఢిల్లీ మెట్రో తర్వాత 69 కిలోమీటర్లతో హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్ లో ఉండేదని, ఎనిమిదేండ్లుగా సెకండ్ఫేజ్పనులు నిలిచిపోవడం వల్ల 9వ ప్లేస్ కు పడిపోయిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సెకండ్‌ఫేజ్ పై స్పెషల్ఫోకస్పెట్టారని, ఆ పనులు పూర్తయితే మళ్లీ దేశంలో సెకండ్ ప్లేస్‌కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన టికెటింగ్ కోసం గూగుల్ వ్యాలెట్, ఆర్సీఎస్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మంగళవారం గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్సీఎస్ టికెటింగ్విధానాన్ని మెట్రో ఎండీ ఎవ్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సూచనల మేరకు మియాపూర్– ఎల్బీనగర్ కారిడార్‌ను మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, నాగోల్ – రాయదుర్గం కారిడార్ ను కోకాపేట్ నియో పోలీస్ వరకు విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు మెట్రోను అన్ని ప్రాంతాలకు కలిపే విధంగా రూపొందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
మూడు కారిడార్లను కలుపుతూ శంషాబాద్ మెట్రో రెండో ఫేజ్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. మొత్తం 76.4 కిలోమీటర్లతో 5 కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం రూ.24,269 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇప్పటికే డీపీఆర్, సీఎంపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. మార్నింగ్ టైంలో సికింద్రాబాద్ నుంచి రాయదుర్గం వరకు, సాయంత్రం రివర్స్ట్రాఫిక్ ఉంటుందన్నారు. దీన్ని అధిగమించడానికి త్వరలో నాగపూర్ నుంచి మెట్రో ట్రైన్లను అద్దె ప్రాతిపదికన తీసుకొస్తామని చెప్పారు.
సాంకేతిక సమస్యలు సాధారణం
మెట్రో రైళ్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు రావడం సర్వసాధారణమని ఎన్వీఎస్రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా హైదరాబాద్ మెట్రో రైల్లో ఆర్సీఎస్తరహా డిజిటల్ వ్యాలెట్ ప్రారంభించామన్నారు. ఫిజికల్ వ్యాలెట్ అవసరం లేకుండా హైదరాబాద్ మెట్రోలో ఎక్కడైనా ప్రయాణించవచ్చన్నారు. టిక్కెట్ తీసుకునే అవసరం లేకుండా గూగుల్ వ్యాలెట్, ఆర్సీఎస్ మొబైల్ ఫోన్‌తో బుకింగ్ చేసుకొని ప్రయాణం చేయవచ్చని తెలిపారు.