భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టనున్నట్టు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. నీతి అయోగ్ ఆస్పి రేషనల్ ఆకాంక్షిత ప్రోగ్రాంలో భాగంగా కలెక్ట్ రేట్ లో గురువారం పలు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా మొదట మూడు మండలాల్లో మూడు టాయిలెట్ల నిర్మాణాలను చేపట్టనున్నట్టు తెలిపారు.
ALSO Read : పదవులకే వీడ్కోలు.. సేవకు కాదు : మంత్రి పొన్నం
తర్వాత అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్మిస్తామని చెప్పారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రిషన్ కమిటీ ద్వారా పోషకాహారం అందించాలని ఆదేశిం చారు. జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, వెలగ, కరివేపాకు, ఉసిరి, చింత మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, సీపీవో శ్రీనివాసరావు, మహిళా, శిశు సంక్షేమ శా ఖాధికారి వేల్పుల విజేత, డీఎంహెచ్ వో డాక్టర్ భాస్కర్ నాయక్, డీఈవో వెంకటేశ్వరాచారి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.