అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సన్న రకం ధాన్యం ఎక్కువ ధరకు కొనే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని వెల్లడించారు. * రైతు బందు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని విమర్శించారు. రెండు లక్షలు రుణమాపి ఆగస్టు 15లోపు చేస్తామని ప్రకటించారు.
నల్గొండ నియోజక వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వస్తుందని జూన్ 5 నుండి అవినీతికి తావు లేకుండా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు కేసులు, ఆరాష్ మెంట్లు ఉండవని చెప్పారు. పంచాయితీ రాజ్ సమన్వయంతో రూ. 450 కోట్లతో నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 50 ఎకరాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడుతామని వెల్లడించారు.
మీడియా కొరకు ప్రత్యేకంగా ప్లాట్ లు, డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని తెలిపారు. డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. పెండింగ్ లో ఉన్నా మూసి, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ముస్లిం మైనార్టీ లకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. స్కిల్ డవెలప్మెంట్ కోసం రూ. 20 కోట్లు కేటాయించామని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓపిక ఉంటే పోటీ చేస్తానని లేదంటే తమ నాయకులు పోటీలో ఉంటారని చెప్పారు. ప్రతీక్ పౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవలు అందిస్తామని వెల్లడించారు. మల్లికార్జున్ ఖర్గే పర్యటన నకిరేకల్ లో ఉండే అవకాశం ఉందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.