హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఒక ముఖ్యమైన ఆచారం

హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హై కోర్టు ఇవాళ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. విద్యా సంస్థ‌ల్లో హిజాబ్‌ను బ్యాన్ చేయాల‌ని దాఖ‌లైన ప‌లు పిటీష‌న్ల‌ల‌ను కొట్టి పారేసింది. అయితే స్కూళ్ల‌లో హిజాబ్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు అని కోర్టు తెలిపింది. హిజాబ్ ధార‌ణ ఇస్లాం మ‌తంలో త‌ప్ప‌నిస‌రి ఆచార‌మేమీ కాదు అని ఇవాళ కోర్టు చెప్పింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు పలువురు పిటిషనర్లు. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఒక ముఖ్యమైన ఆచారమన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పిటిషనర్లలో ఒకరైన సీనియర్ న్యాయవాది ఏఎం ధర్ అన్నారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

ఇటీవ‌ల ఉడిపి కాలేజీలో ఆరుగురు అమ్మాయిలు హిజాబ్ ధ‌రించ‌డం వ‌ల్ల వివాదం ముదిరిన విష‌యం తెలిసిందే.  వారిని క్లాస్ రూంలోకి అనుమతించలేదు. దీంతో వివాదం ముదిరి పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ బ్యాన్ అంశంపై ఇవాళ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై విధించిన బ్యాన్‌ను కోర్టు స‌మ‌ర్థించింది. యూనిఫామ్‌ను ధ‌రించ‌డ‌మ‌నేది ఫ్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం కాదు అని పేర్కొంది. కేవ‌లం ఆంక్ష మాత్ర‌మే అవుతుంద‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ రీతు రాజ్ అవాస్తీ ఇవాళ కోర్టు తీర్పును వెలువ‌రించారు.