పోరాటం కొనసాగిస్తాం.. పోరు ఆగిపోదన్న వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోగాట్

పోరాటం కొనసాగిస్తాం.. పోరు ఆగిపోదన్న వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోగాట్

బలాలీ (హర్యానా): రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ)కి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తామని ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్పష్టం చేసింది. బాధితులకు  న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పారిస్ నుంచి స్వదేశానికి వచ్చిన వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఢిల్లీ, ఆమె స్వగ్రామం హర్యానాలోని బలాలీలో అపూర్వ స్వాగతం లభించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆమె మధ్యలో అభిమానులను కలుస్తూ 13 గంటల తర్వాత  బలాలీకి చేరుకుంది. 

అర్ధరాత్రి ఇంటికి చేరిన ఆమెకు గ్రామస్తులు, ఇరుగు పొరుగు, స్నేహితులు పూల దండలతో స్వాగతం పలికారు. అంతకుముందు డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వ్యతిరేకంగా జరిగిన నిరసన గురించి వినేశ్‌‌ మాట్లాడింది. ‘ఈ పోరాటంలో మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. జీవితమే ఒక పోరాటం. మా  పోరాటం ముగిసిపోలేదు. న్యాయం కోసం మేం ఏడాదిగా పోరాడుతున్నాం. దాన్ని కొనసాగిస్తాం. దేవుడి దయతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేయాలంటూ వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టాప్ రెజ్లర్లు బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పునియా, సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు విడతలుగా నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ కోర్టులో నడుస్తోంది.

 పతకం కోల్పోవడం అది పెద్ద గాయం

తనకు లభించిన అద్భుత స్వాగతం చూసిన తర్వాత జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం కలిగిందని  వినేశ్ చెప్పింది. ‘దేశ ప్రజలు, నా గ్రామం, కుటుంబ సభ్యుల నుంచి నేను పొందిన ప్రేమ.. ఈ గాయాన్ని (ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదురైన)  మాన్పించడానికి  నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఒలింపిక్ పతకాన్ని కోల్పోవడం నా జీవితంలో అతిపెద్ద గాయం, ఈ గాయం మానడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు.  నేను కుస్తీని కొనసాగిస్తానో లేదో నాకు తెలియదు.  కానీ ఈ రోజు నాకు లభించిన ధైర్యాన్ని  సరైన దిశలో ఉపయోగించాలనుకుంటున్నా. బహుశా  నేను రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తిరిగి రావచ్చు.  ప్రజల నుంచి లభిస్తున్న ఇంత మద్దతు, ప్రశంసలకు నేను అర్హురాలినో కాదో  నాకు తెలియదు. కానీ, నేను ఈ గ్రామంలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.  నేను ఎల్లప్పుడూ మహిళల గౌరవం ,ఈ గ్రామం కోసం పోరాడుతాను. 

ఈ గ్రామానికి చెందిన ఎవరైనా నా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి  నేను నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.  నేను నా గ్రామంలోని మహిళా రెజ్లర్లను ప్రోత్సహించగలిగితే  నాకదే అది పెద్ద విజయం అవుతుంది.  నేను నేర్చుకున్నది ఈ గ్రామంలోని  ని అమ్మాయిలతో  పంచుకుంటాను’ అని వినేశ్ చెప్పుకొచ్చింది. 

మహావీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరిస్తే ఎలా: వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గీతా, బబిత  ప్రశ్న

పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో అనర్హత వేటును సవాల్ చేసిన కేసును  కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ (కాస్‌‌‌‌‌‌‌‌) కొట్టి వేసిన తర్వాత వినేశ్‌‌‌‌‌‌‌‌ తన చిన్ననాటి కల, తండ్రిని కోల్పోయిన బాధ,  తన అసాధారణ ప్రయాణంలో  సాయం చేసిన వారిని ప్రస్తావిస్తూ  సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేసింది. కానీ, ఇందులో తన పెదనాన్న మహావీర్ ఫొగాట్‌‌‌‌‌‌‌‌ పేరును ప్రస్తావించలేదు. దీన్ని వినేశ్ కజిన్స్‌‌‌‌‌‌‌‌ గీతా, బబిత ఫొగాట్‌‌‌‌‌‌‌‌ తప్పుబడుతూ సోషల్ మీడియా పోస్టులో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కర్మల ఫలితం చాలా సులభం. ఈ రోజు కాకపోతే  రేపు అయినా మోసానికి మోసమే వస్తుంది’ అని గీత హిందీలో ట్వీట్ చేసింది. వినేశ్‌‌‌‌‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టడానికి కారణమైన మహావీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరును ప్రస్తావించకపోవడాన్ని   ప్రశ్నించే అనేక కామెంట్లను  రీ-పోస్ట్ చేసింది. అయితే, స్వగ్రామం బలాలీ చేరుకున్న తర్వాత వినేశ్‌‌‌‌‌‌‌‌.. తన పెదనాన్న మహావీర్ సింగ్‌‌‌‌‌‌‌‌ను కలిసింది. ఆయనను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.