రాసిపెట్టుకో .. గుజరాత్లో బీజేపీని ఓడగొడుతాం : మోదీకి రాహుల్ గాంధీ సవాల్

రాసిపెట్టుకో ..  గుజరాత్లో బీజేపీని ఓడగొడుతాం : మోదీకి  రాహుల్ గాంధీ సవాల్

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీకి సవాల్ చేశారు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ.  వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో  బీజేపీని ఓడించి తీరుతామని.. ఇది రాసిపెట్టుకోవాలని సవాల్ విసిరారు.  రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ  సందర్భంగా రాహుల్ ఈ సవాల్  చేశారు.  దేశానికి యవతే వెన్నుముక అన్న రాహుల్..  ఉద్యోగాలు ఇవ్వకుండా వారి వెన్నుముక విరిచారని ఫైరయ్యారు.  

రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావనే లేదన్నారు రాహుల్ గాంధీ.  నీట్ పై చర్చను కోరితే ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.  నీట్ తో పేద పిల్లలు వైద్యవిద్యకు దూరమయ్యారని చెప్పారు.  ధనవంతుల కోసమే నీట్ పరీక్షనా అని సభలో ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన నీట్ ను కమర్షియల్ ఎగ్జామ్ గా మార్చారని మండిపడ్డారు.  గత ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని చెప్పుకొచ్చారు రాహుల్.  

అయోధ్య ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మండిపడ్డారు. అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డుపైకి నెట్టారు. భూములు లాక్కుని విమానాశ్రయం నిర్మించారు. మందిరం ప్రారంభ సమయంలో బాధితులు దు:ఖంలో ఉన్నారు. వారిని కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా రానివ్వలేదు అని తీవ్ర విమర్శలు చేశారు.