థేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 థేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: థేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‎లోని హెచ్ఐసీసీలో ఆదివారం (ఏప్రిల్ 13) సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ యాన్వల్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరై ప్రసగించారు.- సైబరాబాద్ బిల్డర్ అసోసియేన్ మొదటి జనరల్ బాడీ సమావేశానికి అభినందనలు తెలిపారు.- తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్, కన్స్ట్రక్షన్ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మీ సమస్యలు ఏం ఉన్న కూడా వెంటనే తీరుస్తామని.. అందరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయండని పిలుపునిచ్చారు. 

హైదరాబాద్ భిన్న సంస్కృతుల నగరమన్నారు.హైదరాబాద్ మౌలిక సదుపాయాలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని.. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, -కృష్ణ గోదావరి జలాలు వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం రెండో దశ మెట్రోఅభివృద్ధి చేస్తున్నామన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ ని తీసుకొస్తున్నాం.- మూసీ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామని చెప్పారు. 

హైదరాబాద్‎ను మరో సిలికాన్ వ్యాలీ‎లా తయారు చేస్తామని పేర్కొన్నారు. సైబరాబాద్ బిల్డర్స్ అందరికి మేం మరింత భరోసా ఇస్తున్నాం. మీకు మరిన్ని లాభాలు వచ్చేలా అభివృద్ధి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నగరానికి -మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ కాబట్టి మరిన్ని భవనాలు నిర్మించండని.. తెలంగాణ ప్రభుత్వంలో బిల్డర్స్ ఎప్పటికి పార్టనర్స్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధిలో మీ పాత్ర ఎప్పటికీ ఉంటుందని.. మీకు ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ వెన్ను దన్నుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.