
హైదరాబాద్, వెలుగు: ఎంతో మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబు చెప్పారు. వీటి ఏర్పాటుకు నిపుణుల సలహాలను తీసుకుంటామని, అంతర్జాతీయ స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం కొత్త పాలసీని తీసుకొచ్చామని, దానికి సంబంధించిన ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌ను త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ స్పార్క్ 2.O సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామన్నారు.