బీసీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కొట్లాడుతాం.. డీఎంకే, ఎన్సీపీ ఎంపీలు

బీసీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కొట్లాడుతాం.. డీఎంకే, ఎన్సీపీ ఎంపీలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నమాని డీఎంకే, ఎన్సీపీ ఎంపీలు అన్నారు. దేశంలోనే కులగణన చేసి రేవంత్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ‘బీసీ పోరు గర్జన’ మహా ధర్నాకు హాజరయ్యారు. బీసీ బిల్లుకు తమ పార్టీలు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ, తమిళనాడు కలిసి కొట్లాడుతాం: కనిమొళి

ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ కణిమొళి మాట్లాడారు. డీఎంకే పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్ధతు ఇస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణకు ఎల్లవేళలా మద్ధతు ఉంటుందని అన్నారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సంతోషం.. కేంద్ర పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని అన్నారు. అందుకోసం దేశవ్యాప్త కులగణన జరపి బీసీలకు వాటా ఇవ్వాలని  డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని కనిమొళి పిలుపునిచ్చారు. డీ లిమిటేషన్, నూతన విద్యా విధానం పేరుతో భాషా సాంస్కృతిక దాడులకు వ్యతిరేకంగా తెలంగాణ, తమిళనాడు కలిసి కొట్లాడుతామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 

ఇక ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మహా ధర్నాకు హాజరయ్యారు. కుల గణన చేయకుండా కేంద్రం బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. అందరికంటే తెలంగాణ రాష్ట్రం ముందుగా కులగణన చేయడం అభినందనీయని అన్నారు. బీసీ బిల్లుకు ఎన్సీపీ మద్ధతు ఇస్తుందని చెప్పారు. పార్లమెంటులో మద్ధతు ఇస్తామని చెప్పారు. కులగణన దేశ వ్యాప్తంగా జరగాల్సి ఉందని, 
పీడితుల పక్షాన నిలబడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 

పార్లమెంటులో బీసీ బిల్లుకు మద్ధతు ఇస్తాం: సుప్రియా సూలే

కులగణన చేసిన తొలి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం కుల గణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన బీసీ బిల్లును ఆమోదించి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులు ఎన్సీపీ పార్టీ బీసీ బిల్లు ఆమోదం పొందేలా మద్ధతు ఇస్తుందని చెప్పారు.