4 నెలల్లో దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ ఫిక్స్ చేస్తాం: రంగనాథ్

హైదరాబాద్: వచ్చే నాలుగు నెలల్లో దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శుక్రవారం (జనవరి 10) హైడ్రా కార్యాలయంలో మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‎తో సమావేశమయ్యారు. దుర్గం చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నిర్మాణాలు వచ్చాయంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మూడు నెల క్రితం రెవిన్యూ అధికారులు పలువురికి నోటీసులు ఇవ్వడంతో దుర్గం చెరువు కాలనీవాసుల అంశం చర్చనీయాంశంగా మారింది.

 దుర్గం చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు తొలగించుకోవాలని లేదంటే మేమే కూల్చి వేస్తామని గతంలో రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం (జనవరి 10) మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‎తో సమావేశమయ్యారు. వాస్తవంగా దుర్గం చెరువు కేవలం 65 ఎకరాలు మాత్రమే ఉండేదని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్‎కు తెలిపారు కాలనీల ప్రతినిధులు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను కమిషనర్ రంగనాథ్‎కు అందజేశారు స్థానికులు. అన్ని వివరాలు సేకరించి నాలుగు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని కాలనీల ప్రతినిధులకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. 

ALSO READ | ఆరిక్ట్ ఇన్నోవేషన్ హబ్తో 300 కొత్త జాబ్స్ : శ్రీధర్ బాబు