కాచిగూడ డివిజన్ ప్రచారంలో కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: జీహెచ్ఎంసి ఆఫీస్ పై బీజేపీ జెండా ఎగరేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కొద్దిసేపటి క్రితం కాచిగూడ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేశారు. కాచిగూడ డివిజన్ బీజేపి అభ్యర్ధి ఉమా రమేష్ యాదవ్ తరుపున ప్రచారం లో పాల్గొన్న సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హమీలను పూర్తిగా మర్చిపోయారని టీఆర్ఎస్ పాలనను దుయ్యబట్టారు. వర్షాల బాధితులకు రూ.10 వేల ఆర్ధిక సాయం ఆదర బాదరా గా ఇష్టానుసారం పంచారని ఆయన విమర్శించారు. 40మంది హైదరాబాద్ వరదల్లో చనిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు 4 వేల కోట్ల తో మూసిని అభివృది చేస్తాం అన్నారు… అభివృద్ది మాత్రం జరగలేదు.. ఓట్లు మాత్రం వేయించుకుని ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు 67వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు.. ? అవి ఎవరికి ఇచ్చారు.. ? ఎవరి జేబులోకి వెళ్లాయో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం తో కలిసి టిఆర్ఎస్ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. అందుకే టీఆర్ఎస్ ను ప్రజలు ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు.
for more News….
పాతబస్తీలో ఎంఐఎం కోటలు కదిలేనా?
గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే
సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్ ఏజెంట్లు
సెప్టెంబర్ వరకు 25 కోట్ల మందికి వ్యాక్సిన్
కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ
V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు