మునుగోడుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

  • పెద్దగట్టు జాతరకు భారీ ఏర్పాట్లు
  • ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి
  • మునుగోడుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి


సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా పెద్దగట్టు (దురాజ్‌‌‌‌‌‌‌‌పల్లి) జాతరకు 15 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్న జాతరను ఘనంగా నిర్వహించాలని సూచించారు. పెద్దగట్టు జాతర ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌  ఉన్నందున హైవేపై ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ ద్వారా నీటిని అందించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. లైటింగ్‌‌‌‌‌‌‌‌, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతర పరిసరాల్లో 150 ఎకరాలు సేకరించి రైతులకు పంట పరిహారం అందజేసినట్లు చెప్పారు. 

సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు, పెద్దగట్టు చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోడి సైదులుయాదవ్, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పెరుమాండ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ గోపగాని వెంకట్‌‌‌‌‌‌‌‌నారాయణగౌడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం టీఎన్‌‌‌‌‌‌‌‌జీవో నాయకులు మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు, టీఎన్‌‌‌‌‌‌‌‌జీవో సంఘం భవనానికి ప్రభుత్వ స్థలం, నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌‌‌‌‌‌‌‌జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌‌‌‌‌‌‌‌కే.జానీమియా, దున్న శ్యాం, నాయకులు నాయిని ఆకాశ్‌‌‌‌‌‌‌‌ వర్మ, దర్శనం మల్లేశ్‌‌‌‌‌‌‌‌, రమేష్,  శ్రీనివాస్, ఆడగడప సైదులు పాల్గొన్నారు. అలాగే మున్నూరు కాపు ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ వరకు సీసీ రోడ్డు నిర్మించాలని ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు గాలి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. 

మునుగోడుకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలం చిన్నకొండూరులో రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో 2014 నుంచి 2018 మధ్యే అభివృ-ద్ధి జరిగిందన్నారు. మొన్నటివరకు ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుబడిందన్నారు. కార్యక్రమంలో చిన్నకొండూరు సర్పంచ్ బక్క శ్రీలత, మండల అధ్యక్షుడు గిరికటి నిరంజన్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వెన్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.