
ఈ సంవత్సరం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన వివేక్.. నియోజకవర్గ ప్రజలతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే వివేక్. ఈ ఏడాది150 టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడం జరిగిందని, ఇది తెలంగాణా చరిత్రలో రికార్డు అని చెప్పారు. చెన్నూర్ నియోజక వర్గానికి 2 టీఎంసీల నీటిని ఇవ్వాలని అసెంబ్లీ లో కోరడం జరిగిందని, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి నీళ్లను ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ అప్పు విషయంలో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మొత్తం రూ. 3.5 లక్షల కోట్లు అప్పు అని అబద్ధం చెప్పారని, కానీ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.7.5 లక్షల కోట్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో నిధులు లేకుండా లక్ష కోట్ల రూపాయలను సాంక్షన్ చేశారని ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 500 లకే గ్యాస్, 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇస్తుందని గుర్తు చేశారు.
Also Read : గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
చెన్నూర్ లో అత్యధికంగా ఎల్ వో సీ లు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు . హుజూర్ నగర్ లో సన్న బియ్యం పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఖజానా ఖాళీ గా ఉన్నా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ పథకం ఒక ఫెయిల్యూర్ పథకం అని చెప్పిన వివేక్.. ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా బోర్ వెల్స్ వేసి నీటి సమస్య తీర్చడం జరిగిందని చెప్పారు. సుమారు నలభై కోట్ల రూపాయలతో చెన్నూర్ ప్రజలకు తాగు నీరు అందించడానికి ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో చాలా చోట్ల రోడ్లు రోడ్లు వేశామని.. గ్రామస్తులు సైడ్ డ్రైన్ లు ఇవ్వాలని కోరారు.
‘‘అమృత్ 2.0 పథకం పనులు ప్రారంభం చేయడం జరిగింది. త్వరలోనే పనులు పూర్తి చేసుకుందాం..’’ అని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. శనివారం (మార్చి 29) అసెంబ్లీ లో 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగిందని గుర్తు చేశారు. ఫారెస్ట్ అనుమతులు రాకపోవడం వల్ల చాలా చోట్ల బ్రిడ్జ్ ల నిర్మాణం జరగలేదని చెప్పారు. కలెక్టర్ తో మాట్లాడి ఫారెస్ట్ భూములను తీసుకుని వారికి వేరే భూములు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు
చెన్నూర్ బై పాస్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించి ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లు రాలేదు కానీ.. తన చెన్నూర్ నియోజకవర్గం సోమణపల్లి గ్రామంలో వచ్చిందదంటే అందుకు గర్వపడాలని సూచించారు. చెన్నూర్ లోని విద్యా సంస్థల్లో ఉన్న లోపాలను గుర్తించి నిధులు వెచ్చించి అన్ని పనులు చేసుకుందామని ఈ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నాయకులతో అన్నారు ఎమ్మెల్యే వివేక్.