రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్న ఉక్రెయిన్ 

రష్యా దాడులకు భయపడే ప్రసక్తేలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దాడులను సమర్థంగా తిప్పి కొడతామని ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. రష్యాతో దౌత్యపరమైన సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. దేశం కోసం పోరాడేందుకు పౌరులు ముందుకొచ్చి తుపాకులు చేతబట్టాలని పిలుపునిచ్చారు. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 40 మంది ఉక్రెయిన్ సైన్యం, 10 మంది పౌరులు చనిపోయారని జెలెన్స్కీ ప్రకటించారు.