వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: స్టాలిన్

వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: స్టాలిన్

వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టంచేశారు. దీనిని అసాంఘిక, ముస్లిం వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 

‘‘వక్ఫ్ ఆస్తుల విషయంలో బీజేపీపై డీఎంకే పోరాడుతుంది.  మెజారిటీ పొలిటికల్ పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదం పొందినా.. వ్యతిరేకించిన ఓట్లను విస్మరించడానికి వీల్లేదు’’ అని అన్నారు.