రేషన్ కార్డ్ ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందిరమ్మ ఇల్లుకు జర ఓపిక పట్టండని కోరారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. మంథనిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని వంశీ ఒక యువకుడు, చదువుకున్న వ్యక్తిని అన్నారు.
పదిమందికి మంచి జరుగుతుందా అని చూసినోడే ప్రజా నాయకుడని చెప్పారు. కుల బలం, మతబలంతో ఈరోజు తాము రాజకీయాల్లో ఉండాలని రాలేదని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన మూర్ఖత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాస్తున్నామని అన్నారు. న్యాయంగా పోయే ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టదని చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటదని మీరు కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే ఒక పార్టీకి ఓటు వేస్తే వృధాగానే పోతుందని అన్నారు. అభివృద్ధి జరగాలంటే యువకుడైన మన వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి