వరద బాధితులను ఆదుకుంటాం:ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​

వరద బాధితులను ఆదుకుంటాం:ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​

మరిపెడ, వెలుగు: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్​డోర్నకల్ ​ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి, సీతారాం తండా వాసులకు కాంగ్రెస్ లీడర్ నూకల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ హాజరై ఉల్లిపల్లిలో 150, సీతారాం తండాలో 55 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్​నాథ్ కేకన్, కాంగ్రెస్ లీడర్లు యుగంధర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి తదితరులున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​ మరిపెడ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాస్ రూమ్స్ వంటశాల డైనింగ్ హాల్ తిరిగి పరిశీలించారు.