జీవో 317 బాధితులకు న్యాయం చేస్తం

జీవో 317 బాధితులకు న్యాయం చేస్తం
  • మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్ ​హామీ
  • గాంధీభవన్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన

హైదరాబాద్, వెలుగు: జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బుధవారం గాంధీభవన్ ఎదుట జీవో 317 బాధితులు నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమకు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు కొంతమంది ఉపాధ్యాయులను గాంధీభవన్ లోపలికి అనుమతించారు. అదే టైమ్ లో అక్కడే ఉన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ను కూడా బాధితులు కలిసి, న్యాయం చేయాలని కోరారు.

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటికే జీవో 317 సమస్యపై దృష్టిపెట్టింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉప సంఘం ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం” అని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ... ‘‘జీవో 317పై ప్రభుత్వం వేసి న ఉప సంఘంలో నేను సభ్యుడిని. మీకు అన్యాయం జరగనివ్వ ను. ఎవరో ఏదో చెబితే దాన్ని నమ్మకండి. గాంధీ జయంతి రోజున అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు” అని చెప్పారు.