- 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరేస్తాం
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లా సీఎం కేసీఆర్ ఖిల్లా అని, వచ్చే ఎన్నికల్లో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సీఎం కేసీఆర్ టికెట్లు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతామన్నారు. టికెట్ రానివారు నిరాశపడొద్దని, పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు ఉంటాయని సూచించారు. టికెట్లు వచ్చిన వారు సహచర నేతలను కలుపుకొని పనిచేయాలని కోరారు.
ALSO READ : మెగా157 అప్డేట్ వచ్చేసింది.. సోషియో ఫాంటసీ కథతో సరికొత్తగా
పోలీస్ శాఖకు మంత్రి ప్రశంసలు
సీఎం కేసీఆర్ పర్యటన విజయవంత కావడంలో కీలకంగా పనిచేసిన పోలీస్ శాఖను మంత్రి జగదీశ్ రెడ్డి అభినందించారు. సోమవారం ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర్ రావ్, డీఎస్పీ నాగ భూషణం, సీఐ రాజశేఖర్‌ను సన్మానించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ.. జిల్లాలో లాఅండ్‌ఆర్డర్ బాగుందని, టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.