పార్లమెంట్ ఎన్నికల్లోపు.. 2 గ్యారంటీలు అమలు : అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.  ఆరు హామీల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు.  ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి  హామీలు అమలు చేస్తామన్నారు.  బీఆర్ఎస్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.   ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన కామెంట్స్  పై శ్రీధర్ బాబు మాట్లాడారు. 

ప్రభుత్వం ఏర్పడిన పదోరోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్త ప్రభుత్వానికి వంద రోజులు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.  హామీలను కాంగ్రెస్  అమలు చేయోద్దనే  బీఆర్ఎస్ నాయకులకు ఉందన్నారు.  ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామన్న  శ్రీధర్ బాబు.. మరో రెండు హామీలను పార్లమెంట్ ఎన్నికల లోపే అమలు చేస్తామన్నారు.