తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‎ను ఆహ్వానిస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్‎లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎ను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని పేర్కొన్నారు.  బుధవారం (డిసెంబర్ 5) ఇందిరమ్మ ఇళ్ల యాప్ లాంఛ్ సందర్భంగా సెక్రటేరియట్‎లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీలు అంటే శత్రువులన్నట్టుగా కేసీఆర్ క్రియేట్ చేశారని.. కానీ ప్రభుత్వం అంటే ఒక్క కాంగ్రెస్ సభ్యులే కాదని.. 119 మంది ఎమ్మెల్యేలని అన్నారు. సభలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి సమప్రాధాన్యం ఉంటుందన్నారు. కేసీఆర్‌ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని.. మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని  అన్నారు. ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదని.. పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రశ్నించాలని కోరారు.

ALSO READ | పదేళ్ల పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు తప్ప పేదల ఇళ్లను పట్టించుకోలే: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ కంటే మేం జూనియర్‌ శాసనసభ్యులమేనన్నారు-. కేసీఆర్ ఆ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదని.. ఇకనైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఈ నెల 9వ తేదీ నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరు కావాలన్నారు. మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదని.. రాక్షసులను తయారుచేసి మా మీదకు ఉసిగొల్పడం మంచిదా- అని ప్రశ్నించారు.