వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకుర్ అన్నారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. అగస్టు 15వ తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పనిదినాలను 200 రోజులు చేస్తామని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామన్నారు. పాలకుర్తి లిఫ్ట్ ఈరిగేషన్ పత్తిపాక రిజర్వాయర్ తో పాటు కుక్కలాగూడూర్ బండలవాగు ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాజ్ ఠాకుర్ తెలిపారు.